ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కొత్త డ్రామా
దాడులు, ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడూతూ అన్ని కులాలను మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. మునుగోడు ప్రజల బాధలను హామీలను ప్రస్తావించకుండా పారిపోయిన పిరికిపంద కేసీఆర్ అని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఉద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి టీఎన్జీవో నేతలు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కొత్త డ్రామాలడుతుందన్నారు. పలివెలలో టీఆర్ఎస్ గుండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈటల రాజేందర్ సౌమ్యుడు, అతనిపైనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.













