కేసీఆర్‌ను ఎప్పుడు టచ్ చేయాలో.. అప్పుడు టచ్ చేస్తాం
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎప్పుడు టచ్ చేయాలో అప్పుడు టచ్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై డప్పు మోత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రజల కోసం అవసరమైతే తల నరుక్కోవడానికైనా సిద్ధమన్నారు. నా తల ఆరు ముక్కలు కాదు అరవై ముక్కలైనా సరే అన్నారు. దళిత బంధు రాష్ట్రమంతా అమలు చేసే వరకు కేసీఆర్ నిద్ర పోనిచ్చేది లేదన్నారు. దళితుడిని సీఎం చేసే వరకు కేసీఆర్‌పై పోరాటం ఉంటుందన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించారు. నయా నిజాంను గద్దె దించే వరకు ఊరుకునేది లేదు. వానాకాలం ధాన్యం మొత్తం కొంటారో లేదో కేసీఆర్ చెప్పాలి. దళితులు ఓట్లు వేయకుంటే రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిన రోజు కేసీఆర్ ఎందుకు సభలో లేడు అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను తరిమి కొట్టటానికి కంకణం కట్టుకున్నానని అన్నారు.













