మునుగోడు బీజేపీదే.. ఈ వార్త విని కేసిఆర్ కు ఫీవర్: బండి సంజయ్
మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తుందని, ఈ విషయం తెలిసి సీఎం కేసిఆర్ కు జ్వరం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగొడులోని విలువైన భూములపై టీఆర్ఎస్ నేతల కళ్లు పడ్డాయని చెప్పిన ఆయన.. టీఆర్ఎస్ గెలిస్తే ఆ భూములు కచ్చితంగా కబ్జా అవుతాయని జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లిలో జరిగిన రోడ్ షోలో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో చేసిన సర్వే.. బీజేపీ విజయం ఖాయమని, ఈ సమాచారం కేసీఆర్ కు అందడంతో ఆయనకు జ్వరం పట్టిందన్నారు. మాజీ కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగుడులో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని ఆయన తెలిపారు.













