బిడ్డను సీబీఐ అరెస్ట్ చేస్తే… తెలంగాణ సెంటిమెంట్ తో కుట్ర
దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిడ్డను సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ నెల 11న కేసీఆర్ బిడ్డ సంగతి తేలుతుందన్నారు. దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీఎల్ సంతోష్ జీపైనే కేసు పెడతవా?, ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందాను చూసి దేశమంతా అసహించుకుంటోందన్నారు. తెలంగాణ తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్కు నిద్ర పట్టడం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలుకు పైసల్లేవట, ప్రజాధనాన్ని లూటీ చేసి లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తారా? అని ప్రశ్నించారు.













