జనవరిలోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే… అసెంబ్లీ సమావేశాలను
మానవత్వం లేని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తమ పార్టీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్ అడ్డుకొంటున్నారని విమర్శించారు. తమ పార్టీ దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. జనవరిలోపు నోటిఫికేషన్లు ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ప్రకటించారు. దొంగ దీక్షలు ఎలా చేయాలో మంత్రి కేటీఆర్ తన తండ్రిని అడిగి తెలుసుకోవాలన్నారు. 2009 కేసీఆర్ దీక్షపై ఖమ్మం డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్‌ను బయటపెడతామని హెచ్చరించారు. దీక్ష సమయంలో బాత్రూంలో ఇడ్లీలు తిన్న చరిత్ర కేసీఆర్‌దని ఆరోపించారు. దీక్ష పేరుతో ఢిల్లీ వెళ్లి కేసీఆర్ తాగిపడుకున్నాడని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామంటాడని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. తన దీక్షకు సంఫీుభావం ప్రకటించిన ఓయూ విద్యార్థులతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.













