ప్రధాని మోదీని కలిసిన బండి సంజయ్
తెలంగాణలో రానున్న శానససభ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మరింతగా కృషి చేయాలని బండి సంజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత సంజయ్ తొలిసారి తన సతీమణి అపర్ణ, కుమారులు సాయి భగీరథ్, సాయి సుముఖ్లతో కలిసి ప్రధానిని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. సంజయ్ కుమారుల విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కష్టపడ్డారంటూ సంజయ్‌ను అభినందించారు.













