ఎన్ని అడ్డంకులు సృష్టించినా… యాత్ర ఆపే ప్రసక్తే లేదు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాసంగ్రామయాత్ర ఆపే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్లో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు సీఎం కేసీఆర్ మరో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కాంపై చర్చను దారి మళ్లిచేందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. తన బిడ్డను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమంగ్రామయాత్రను అడ్డుకునేందుకు సీఎం డైరెక్షన్లోనే ప్లాన్ చేశారని పేర్కొన్నారు. పాదయాత్రలో సీఎం కేసీఆర్ కుటుంబ చీకటి దందాలన్నీ బయటపెడుతున్నామనే తట్టుకోలేక దాడులు చేయిస్తున్నారని మండిపడ్డాడరు. 27న హనమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిచిన తీరుతామని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లో యాత్రను ఏ విధంగా అడ్డుకున్నారో ప్రజలు చూశారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమయ్యాయి. ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ప్రజలను కలిసి పేదల బాధలు తెలుసుకుని భరోసా ఇవ్వాల్సిన సీఎం ఫాంహౌస్, ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారు. శాంతి భద్రతు కాపాడాల్సిన సీఎం కుటుంబమే శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోందన్నారు. టీఆర్ఎస్ నేతలను పిలిచి రాళ్లు, రాడ్లతో దాడులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. మా ఊపిరి ఉన్నంత వరకు యాత్ర చేసి తీరుతాం అని స్పష్టం చేశారు.













