బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మునుగోడులో దొడ్డిదారిన గెలవాలని టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోంది. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. టీఆర్ఎస్ వైఖరిని మునుగోడు ప్రజలు గమనిస్తున్నారు. మునుగోడులో ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నిక. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఓ ఒక్క హామీ నెరవేరలేదు. కేసీఆర్ అహం దిగాలంటే టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.













