సీఎం ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు : బండి
సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్లు, కళ్లాల్లో ఎక్కడ చూసిన ధాన్యమే ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ పామ్ హౌస్లో ఉంటే రైతుల సమస్యలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. రైతుల మీద దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్డు, రాళ్లు వేస్తే రైతులకు తగిలాయని, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీపైసా కేంద్రం ఇస్తుందని కోటి లక్షల టన్నుల ధాన్యం కేంద్రం కొన్నదని తెలిపారు. దసరా పండగ కంటే ముందు రైతులు ధాన్యం తీసుకొచ్చారని కొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తిందన్నారు. పత్తి, మక్కలు, కందులు కేంద్రమే కొంటుందని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంగల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల కోసం రాళ్లదాడికైనా, ఎన్నైనా భరించడానికి సిద్ధమని అన్నారు.













