రాష్ట్ర సమస్యలు పరిష్కరించకుండా… జాతీయ పార్టీ పెట్టి ఏం సాధిస్తారు ? : బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఏం సాధిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ మద్యం కేసుపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఎంతమందికి రైతు రుణమాఫీ అమలు చేశారు? ఎంతమందికి దళితబందు ఇచ్చారు? ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇచ్చారు. మీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలెన్ని? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయలేకపోయారు? ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు ఇవ్వకపోవడానికి కారణమేంటి? కేంద్ర ఇచ్చే సంక్షేమ పథకాలను ఎందుకు నీరుగారుస్తున్నారు? అని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షాలకు తెలంగాణ అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ ఎందుకు సహకరించడం లేదు అని ప్రశ్నించారు.













