ఆగస్టు 9 నుంచి పాదయాత్ర…
తెలంగాణ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆగస్టు 9న హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభించి హుజురాబాద్‌లో సభతో ఆక్టోబరు 2న యాత్ర ముగించనున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దెదించి గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిరచడం, ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా, సీఎం అవినీతి, గడీల పాలనకు వ్యతిరేకంగా 55 రోజుల పాటు 750 కి.మీ వేర పాదయాత్ర సాగుతుందని తెలిపారు.
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే అవినీతి, అరాచకాల్ని ప్రజల సమక్షంలోనే బహిర్గతం చేస్తానని అన్నారు. వందల మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఒక కుటుంబమే రాజ్యమేలుతోందని విమర్శించారు. కార్యవర్గ సమావేశంలో చర్చించాక పాదయాత్ర విషయాన్ని సంజయ్ వెల్లడిరచారు. హైదరాబాద్‌లో ప్రారంభమై హుజూరాబాద్‌లో ముగిసేలా సంజయ్ రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఆగస్టు 9న తొలిరోజు బేగంబజార్, నాంపల్లి, బాపూఘాట్ మీదుగా ఆరె మైసమ్మ ఆలయం వరకు సాగుతుంది. తర్వాత చేవెళ్ల మీదుగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాకు వరకు ప్రతిరోజు 15`20 కిమీ వరకు పాదయాత్ర చేస్తారు. కార్యక్రమం విజయవంతానికి పలు కమిటీలను ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధి అన్ని మండలాల్లోనూ సంజయ్ పాదయాత్ర సాగుతుందని పార్టీ వెల్లడిరచింది.













