ముగిసిన బండి సంజయ్ అమెరికా పర్యటన
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అమెరికా పర్యటన ముగిసింది. ఈ నెల 1న అమెరికా వెళ్లిన బండి సంజయ్ గత 10 రోజులుగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రవాస భారతీయులు, వ్యాపార వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో అట్లాంటా జార్జియాలో, 4న నార్త్ కరోలినాలోని చార్లెట్ ఎన్సీ, 6న వాషింగ్టన్ డీసీ, 7న న్యూయార్క్, 8న న్యూజెర్సీ, 9న డల్లాస్ లో 10న ఫ్రిస్కో టెక్సాస్ ప్రాంతాల్లో పర్యటించారు. బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా ఎన్నారైలు ముఖ్యంగా తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలతో అపూర్వ స్వాగతం పలికారు.













