పక్కా ప్లాన్ ప్రకారమే టీఆర్ఎస్ దాడి : బండి సంజయ్
సికింద్రాబాద్ అల్లర్ల వెనుక తెలంగాణ ప్రభుత్వ హస్తముందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తి కేంద్ర ఇంఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్కా ఫ్లాన్ ప్రకారమే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారన్నారు. అల్లర్లు జరుగుతాయని తెలిసే పోలీసులు అలసత్వం వహించారని తెలిపారు. రైల్వే స్టేషన్లోకి పెట్రోల్ ఎలా వచ్చింది? కేంద్రంపై బురదజల్లేందుకే టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన నష్టానికి కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అని అన్నారు. అగ్నిపథ్ గొప్ప స్కీమ్ అని అన్నారు. ఆర్మీ అభ్యర్థులు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని వారికి సూచించారు.













