గడీల గూండాల దాడులకు భయపడం : బండి సంజయ్
టీఆర్ఎస్కు ప్రజాస్వామ్యాన్ని ఎదుర్కొనే దమ్ము లేక ఆ పార్టీ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అరవింద్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దములు టీఆర్ఎస్ నేతలు అన్నారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూస్తున్నారు. గడీల గూండాల దాడేలకు బయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ నేతల సహాసాన్ని చేతగాని తనం అనుకోవద్దని, మా కార్యకర్తలు బరిలో దిగితే మీరు తట్టుకోలేరన్నారు. తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ గూండాలకు బుద్ధి చెబుతారని అన్నారు.













