దసరా పండగ సందర్భంగా… 17న అలయ్ బలయ్
దసరా పండగను పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన జలవిహార్‌లో నిర్వహిస్తున్నట్లు హరియాణా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హరియాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలిపారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించామని తెలిపారు.













