ఈ నెల 17న అలయ్-బలయ్
ప్రతి ఏటా దసరా సందర్భంగా ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆనవాయితీగా నిర్వహించే కార్యక్రమం అక్టోబరు 17న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహక కమిటీ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్యక్షతన అలయ్ బలయ్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అలయ్ బలయ్ ఉత్సవాల నిర్వాహణ, ఏర్పాట్ల కోసం నిర్వాహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ అలయ్`బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమచల్‌ప్రదేశ్ గవర్నర్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా ముఖ్యమంత్రులు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు అన్ని రాజకీయ పక్షాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, విద్యావేత్తలు పాల్గొంటారని తెలిపారు.
ఈ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, బీజేపీ నగర నేతలు బి.శ్వామ్సుందర్ గౌడ్, డాక్టర్ గౌతంరావు, బి.వెంకటరెడ్డి, వెంకటరమణ, జి.ఆనంద్‌గౌడ్, యోగానంద్, ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.













