భద్రాద్రిలో ముగిసిన బాలోత్సవ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మూడ్రోజులపాటు నిర్వహించిన భద్రాద్రి బాల్సోతవం ముగిసింది. ముగింపు వేడుకలకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతీ మనిషిలో నైపుణ్యం దాగి ఉంటుందని, దాని బయటకు తీసుకురావాలన్నారు. బాలోత్సవం నిర్వాహకుడు తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ బాలోత్సవం కార్యక్రమంతో పిల్లల్లో దాగిఉన్న సృజనాత్మకత బయటకు వస్తుందని చెప్పారు. ఆనంతరం వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.













