అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
హైదరాబాద్ నగరంలోని బల్కంపేటలో ఉన్న ఎల్లమ్య దేవాలయంలో అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవదాయశాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకలకు పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.













