అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు.