బసవతారకం ఆస్పత్రికి ప్రముఖులు భారీగా విరాళాలు
కేన్సర్ నివారణకు దాతలు తోడ్పాటునందించాలని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రికి ముగ్గురు ప్రముఖులు భారీ విరాళాలు అందించారు. సో-హమ్ ఫౌండేషన్ తరపున ఆ సంస్థ బోర్డు సభ్యుడు దొరైస్వామి నాగరాజన్ లక్ష అమెరికన్ డాలర్లు (సుమారు రూ.72.62 లక్షలు), రోటరీ పౌండేషన్ వారు రూ.60 లక్షల విలువ చేసే యంత్ర సామగ్రి, నిర్మాత దేవినేని ప్రసాద్ రూ.50 లక్షలు అందజేశారు. కాగా, కేన్సర్‌తో బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన స్వప్నను బాలకృష్ణ పరామర్శించారు.













