భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ అత్యద్భుతంగా
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని ‘టెంపుల్ సిటీ’గా మార్చేందుకు రూపొందించిన ‘నమూనా’ను రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నజీయర్‌కు చూపించారు. హైదరాబాద్ సమీపంలోని శ్రీరాంనగర్‌లో జీయర్ను తుమ్మల కలిశారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్కిటెక్ట్ ఆనందసాయి రూపొందించిన నమూనాను చిన్నజీయర్ పరిశీలించారు. ఆనందసాయి కొన్ని నమూనాలను రూపొందించిన తర్వాత చిన జీయర్తోపాటు భద్రాచలం ఆలయ పూజారులు, వేద పండితులు పరిశీలించి గతంలోనే కొన్ని సూచనలు చేశారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నమూనాను ఆనంద్‌సాయి రూపొందించారు. నమూనా అత్యద్భుతంగా ఉందని, దీని ప్రకారం భద్రాచలం టెంపుల్ సిటీ నిర్మిస్తే అంతర్జాతీయంగానూ పేరు లభిస్తుందన్నారు. ఆనంద్‌సాయి రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై చిన జీయర్ తన సందేశాన్ని రాసి సంతకం చేశారు.













