అయోధ్యకు రండి.. కేసీఆర్ కు ఆహ్వానం
ఈ నెల 22న అయోధ్యలో నిర్వహించనున్న రామమందిర ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పలికింది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు పంపిన ట్రస్ట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా ఆహ్వాన పత్రికలు పంపింది. అయితే కేసీఆర్కు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.













