తనకు ఎలాంటి సంబంధం లేదు.. కావాలనే
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావుతో పాటు మరో ముగ్గురి కస్టడీ ముగిసింది. ఆవుల సుబ్బారావుతో పాటు అతని ముగ్గురు అనుచరులను రెండు రోజుల పాటు సికింద్రాబాద్ ఘటనకు సంబంధించి పలు కోణాల్లో రైల్వే పోలీసులు ప్రశ్నించారు. ఘటన జరిగే ముందు రోజు సికింద్రాబాద్‌లోనే ఉండి ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, రైల్వే స్టేషన్ విధ్వంసానికి సంబంధించిన వ్యూహాలను రచించడం, విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి వారిని ఉసిగొల్పే విధంగా ప్రేరేపించడం వంటి అంశాలపై ప్రశ్నించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తనను కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విచారణలో చెప్పినట్లు తెలిసింది.













