ఆస్ట్రేలియాలో నాయని నరసింహ రెడ్డికు ఘనస్వాగతం
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్నా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు పాల్గొనేందుకు అడుగుపెట్టిన హోం శాఖా మాత్యులు శ్రీ నాయని నరసింహరెడ్డికు ఘనస్వాగతం సిడ్నీలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం సిడ్నీలోని కింగ్స్ఫోర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మినిస్టర్ నాయని నరసింహ రెడ్డికు ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్ సభ్యులు వారితో పాటు వివిధ తెలంగాణ సంఘాలైన తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరమ్, ఆస్ట్రేలియ సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు పెద్దసంఖ్యలో హాజరై హోం శాఖా మాత్యులుకు ఘన స్వాగతంపలికారు.
ఇండియన్ కాన్సులర్ జనరల్ – స్.కే. వెర్మ – ఇండియన్ హై కమ్మిషన్ – ఆస్ట్రేలియా తరఫున మర్యాద పూర్వకంగా స్వాగతించారు. ఈ పర్యటనలో నాయని నరసింహరెడ్డి గారు ఆస్ట్రేలియాలోని పలు రాజకీయ నాయకులను కలుసుకుని తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించనున్నారు. అదే విధంగా డిసెంబర్ 2న ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్నా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు పాల్గొననున్నారు.
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, అనిల్ మునగాల, ప్రదీప్ సేరి, రామ్ గుమ్మడివాలి, గోవెర్దన్, సుమేషు రెడ్డి, వాసు తాట్కూర్ ప్రశాంత్ కడపర్తి మరియు ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు కామిటే చైర్మన్ వినోద్ ఎలెట, భారతీ రెడ్డి, ఇంద్రసేన్, పాపి రెడ్డి, నరసింహ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఏటిఫ్ ఆధ్వర్యంలో జరగనున్నా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు శ్రీ నాయని నరసింహరెడ్డి తో పాటు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు – v శ్రీనివాస్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి – శ్రీ మహమ్మద్. అజమ్ అలీ గారు, మరియు టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు – శ్రీ సంతోష్ గుప్తా గారు పాల్గొంటారు.













