బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై దాడికి యత్నం.. ఎంఐఎం నాయకులపై కేసు

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై దాడికి ప్రయత్నించిన కేసులో ఎంఐఎం నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాధవీలత అనుచరుడు నసీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ సమయంలో పోలింగ్ బూతులను పరీశీలించడానికి వెళ్లిన మాధవీలతపై అక్కడే ఉన్న ఎంఐఎం నాయకుడు, యాకత్‌పుర పార్టీ ఇంచార్జ్ యాసిర్ అర్ఫాత్ దాడికి ప్రయత్నించాడు. కారులో వెళ్తున్న సమయంలో మరికొంతమంది తో కలిసి వెంటపడుతూ దాడి చేయబోయాడు. బీబీబజార్‌లో ఏకంగా 100 మందికి పైగా ఎంఐఎం నాయకులు తమ నాయకురాలిని ముట్టడించి.. ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడూతూ దాడికి ప్రయత్నించినట్లు నసీమ్ తన ఫిర్యాదులో తెలిపారు. కాగా.. నసీమ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంఐఎం నాయకులపై 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మొగల్‌పురా పోలీసులు తెలిపారు. అలాగే 41 సీఆర్పీసీ సెక్షన్ కింద నిందితులకు నోటీసులు కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు.