బీజేపీ నేత రామచంద్రరావుకు ఆటా ఆహ్వానం

వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న 18వ అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌కు గౌరవ అతిథిగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును ఆహ్వానించింది. ఈ సభల్లో భాగంగా నిర్వహిస్తున్న రాజకీయ సమావేశాల్లో బీజేపీ తరపున ఆయన ప్రసంగించనున్నారు. ఈ వేరకు ఆయనకు ఆటా అధ్యక్షుడు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు రామచంద్రరావు వచ్చే నెల 7న ఇక్కడి నుంచి బయల్దేరనున్నారు.