అమెరికా తెలుగు సంఘం ఉచిత కోవిడ్ -19 టెస్ట్ కిట్లు పంపిణీ
అమెరికా తెలుగు సంఘం ఉచిత కోవిడ్-19 టెస్ట్ కిట్లు పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ లోని జాయ్ ఫౌండేసన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిగ్ బాస్ 5 విన్నర్ వీజే సన్నీ, ప్రముఖ సింగర్ ఇండియన్ ఐడల్ 9 విన్నర్ రేవంత్ హాజరయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 3వ వేవ్ లో పరిక్ష కేంద్రాలకు వెళ్ళే అవకాశం వృద్దులకు చాలా కష్టం అని, ఓల్డ్ ఏజ్ హోమ్ ల పరిస్థితి మారింత దారుణంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి సరైన సదుపాయాలు లభించడమే చాలా కష్టంగా ఉంది. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని తమ వంతు సహయంగా ముందుడుగు వేస్తూ అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఉచితంగా కోవిడ్ 19 టెస్టింగ్ కిట్లు పంపిణీ చేసిందని ఆటా నాయకులు తెలిపారు. ఆటా మరియు అపెక్స్ కోవంటేజీ ఆధ్వర్యంలో జాయ్ పౌండేషన్ లో దాదాపు 1000 వృద్దులకు ఈ కోవిడ్ టెస్టింగ్ కిట్లు ఉచితంగా సరఫరా చేయటంపై పలువురు ఆటాను అభినందించారు.













