హైదరాబాద్ లో అరుదైన ఘటన
ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్న తన కుమార్తె ఐశ్వర్య సింగ్కు అసోం డీజీపీ గ్యానేంద్ర ప్రతాప్సింగ్ సెల్యూట్ చేశారు. ఈ అరుదైన ఘటన హైదరాబాద్లోని సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోటు చేసుకుంది. ఈ ఉద్విగ్న క్షణాలకు సంబంధించిన వీడియోను అసోం డీజీపీ తన ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేశారు. ఆ వీడియోలో తండ్రికి కుమార్తె, కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ నవ్వుతూ ఫొటోలకు పోజిచ్చారు. నాకు చాలా గర్వరంగా ఉంది. నాలాగే కుమార్తె కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.













