అష్టముఖ గండభేరుండ నృసింహమహాయాగం
హైదరాబాద్‌లోని మణికొండ అనంత రత్నగిరి హిల్స్‌పై ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో లోకక్షేమం, ఆరోగ్యవృద్ధి కోసం నవంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు యాగాలు నిర్వహిస్తున్నారు. అకల్మష హోమం, అష్టముఖ గండభేరుండ నృసింహ మహాయాగం, రాజ్యశ్రీ యాగం, రక్షణ కవచ మహాసుదర్శన యాగంతోపాటు శ్రీ శ్రీనివాస కళ్యాణం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
నవంబర్ 11వ తేదీన పద్మశ్రీ డా. ఎల్లా వెంకటేశ్వరరావు, వారి బృందంచే కచేరి, 12వ తేదీన జ్యోతిరెడ్డి, వారి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన, 13న రాధా పద్మనాభన్ గానం, 14న శ్రీమతి వోలేటి రేఖ కూచిపూడి నృత్యం, 15న శ్రీ బాలమురళీ కృష్ణ ఎల్ల, వారి బృందం గానం, 16న శ్రీమతి సుబ్బలక్ష్మీ వారి బృందం గానం ఉంటుంది. శ్రీ ప్రపన్న శ్రీ కరుణాకరం వేంకటనాథ సింహయాజి స్వామి ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరుగుతోంది. భక్తులంతా ఈ కార్యక్రమాలకు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.













