సీఎం ఎవరో చెప్పకుండానే ఎన్నికల బరిలోకి దిగుతున్న తెలంగాణ పార్టీలు!
తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పార్టీలన్నీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియకుండానే బరిలోకి దిగబోతున్నాయి. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు సీఎం అభ్యర్థి ఎవరో ముందే చెప్పేస్తుంటాయి. జాతీయ పార్టీలు మాత్రం ఎన్నికలైన తర్వాతే సీఎంని ఎంపిక చేస్తుంటాయి. కానీ ఈసారి తెలంగాణలో బిజెపి కాంగ్రెస్‌లను మినహాయిస్తే టిఆర్ఎస్ కూడా జాతీయ రంగు పులుముకుంది. దీంతో సీఎం అభ్యర్థి ఎవరో తేల్చకుండానే బరిలోకి దిగబోతోంది.
బిఆర్ఎస్ అధినేత కేసిఆర్. ఆ పార్టీకి ఆయనే సర్వాంతర్యామి. ఆయన ఏది అనుకుంటే అదే జరుగుతుంది. సీఎంగా ఎవరుంటారనేది ఆయన ఇష్టం. ఇన్నాళ్లు పార్టీలో ఆయనదే పెత్తనం. కూడా ఆయనే పార్టీ అధ్యక్షుడు. అయితే ఇప్పుడు అది జాతీయ పార్టీగా మారింది. ఇన్నాళ్లు పరిమితమైన కేసీఆర్ ఇక్కడ సీఎంగా ఉంటూ వచ్చారు. కానీ కానీ ఇప్పుడు ఆయన దృష్టి అంతా దేశం పైన ఉంది. అందుకే ఈసారి తెలంగాణను వదిలేయాలని, ఢిల్లీలో ముఖం వేయాలని భావిస్తున్నారు. అందుకే కెసిఆర్ ఈసారి పోటీ చేస్తారని తెలుస్తోంది. కెసిఆర్ తర్వాత కేటీఆర్ ఏ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి ఇది నిజం కూడా. కెసిఆర్ తర్వాత కేటీఆర్ మాత్రమే సీఎం పగ్గాలు చేపడతారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు కేటీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పకుండా వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పితగా పేరుందిన కెసిఆర్ ముఖ్యమంత్రి కాదని తెలిస్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో, కేటీఆర్ ను ఆమోదిస్తారో లేదో అనే సందేహాలు కెసిఆర్ కు ఉన్నాయి. అందుకే సీఎం ఎవరనేది చెప్పకుండా బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే పార్టీ ఎప్పుడూ కూడా సీఎం ఎవరో చెప్పదు. ఎన్నికల అయిన తర్వాత పార్టీ గెలిస్తే అప్పుడు ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి సీఎం అభ్యర్థి నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేస్తూ ఓ సీల్డ్ కవర్‌ను ఢిల్లీ పంపిస్తుంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సంప్రదాయాన్ని ఫాలో అవుతుంది. అయితే అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ కుమ్ములాటలు స్థాయిలో ఉన్నాయి. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అని ముందుగా ప్రకటిస్తే సీనియర్లు పొరపాటున కూడా సహకరించరు. ఒకవేళ తనను కాదని వేరే వాళ్లను సీఎం సీటులో కూర్చోబెడతారని రేవంత్ రెడ్డి భావిస్తే ఆయన కూడా సహకరిస్తారని చెప్పలేదు. అందుకే ఇలాంటి విషయాలు జోలికి పోకుండా ముందు ఎన్నికల బరిలో దిగి తేల్చుకొని రమ్మంటుంది కాంగ్రెస్ అధిష్టానం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు పొరపాటున కూడా ముందే తెలీదు.
ఇక బిజెపి విషయానికొస్తే ఆ పార్టీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఈసారి కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని బిజెపి హై కమాండ్ భావిస్తుంది. రాష్ట్ర నేతలు కూడా కెసిఆర్ సర్కార్‌ను ఓడిస్తామని నమ్మకంగా ఉంది. అయితే బిజెపిలో సీటు ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగానే ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి తానే సీఎం కావాలని కలలు కంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు కూడా సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్నారు. సీఎం పీఠం కోసం పోటీ భారీగా ఉన్నందున ముఖ్యమంత్రి అభ్యర్థిని బిజెపి ముందే ప్రకటించకుండా నేతలందరూ కలిసికట్టుగా వెళ్లి ఎన్నికల్లో గెలిచి రావాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీంతో బిజెపిలో కూడా డైలమా నెలకొంది.
ఇలా తెలంగాణలో ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియకుండానే పార్టీలన్నీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. కాంగ్రెస్ బిజెపి విషయాలను పక్కనపెడితే కనీసం బీఆర్ఎస్ కూడా ఈసారి అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది.













