బీజేపీ, కాంగ్రెస్లో ఉన్నవాళ్లు కూడా… దరఖాస్తు చేసుకోవచ్చు
బీజేపీ, కాంగ్రెస్లో ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అంటే కొత్త చరిత్ర రాయడం, కేసీఆర్ అంటే కొలువులు చదువులు రిజర్వేషన్లు అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇక సంపూర్ణమయ్యాయని తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్ళు కడిగినమన్నారు. నిధులతో ఈ బడ్జెట్లో భారీ నిధులు కేటాయించారని తెలిపారు. నీళ్లు నిధులు తీసుకొచ్చి, నియామకాలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
మన ఊరు మన బడితో విద్యానందిస్తున్నామన్నారు. ఇవాళ ఒక దుర్దినంగా ప్రతిపక్షాలు భావిస్తున్నారని, వాళ్లకు మాటలు రాకుండా సీఎం కేసీఆర్ చేశారని అన్నారు. మొత్తం నియమకాలు భర్తీ చేయబోతున్నామని తెలిపారు. నిరుద్యోగులు బీజేపీ ట్రాప్ పడకండని సూచించారు. తన నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు తన సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లు పెడతానని హామీ ఇచ్చారు.













