కరోనా విజృంభణ…యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా విజృంభణతో గత కొన్ని రోజులుగా దాదాపు 73 మంది ఆలయ సిబ్బంది, అర్చకులు వైరస్ బారినపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆర్జిత సేవలు, అన్నప్రసాదం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు లేకుండానే ఏకాంతంగా దైవారాధనలు చేయనున్నట్లు తెలిపారు. అయితే లఘుదర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో యాదాద్రిలో రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా దుకాణాల బంద్కు వ్యాపారులు పిలుపునిచ్చారు.













