తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మూసేస్తారా? హైకోర్టు సూటి ప్రశ్న

టీఎస్‌పీఎస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని హైకోర్టు తీవ్రంగా దుయ్యబట్టింది. టీఎస్‌పీఎస్సీని మూసేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి 4 వారాల్లోగా చైర్మన్, సభ్యులను నియమించాలని హైకోర్టు ఆదేశించింది. నిరుద్యోగి శంకర్ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది చాలా ముఖ్యమైనదని, చైర్మన్, సభ్యులను నియమించకపోతే దానిని మూసేయాలని చురకలంటించింది. చైర్మన్, సభ్యులను నియమించి, తమకు ఓ నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే కమిషన్ సభ్యుల నియామకాలు చేపడతామని హైకోర్టుకు ఏజీ నివేదించారు. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.