28న కేసీఆర్, జగన్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న సమావేశం కానున్నారు. ప్రగతి భవన్లో వీరి భేటీ ఉంటుందని తెలిసింది. నదీ జలాల పంపకాలపై వీరు చర్చించనున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎజెండా ఖరారు కాలేదని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. గోదావరి నదిలో వృధాగా పోతున్న ఐదు వేల క్యూసెక్యుల నీటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకోవాలని ఇటీవల కేసీఆర్ ప్రతిపాదించారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించటం ద్వారా రెండు రాష్ట్రాల్లోని వెనుక బడిన, మెట్ట ప్రాంతాలకు సాగునీరందించవచ్చని వీరిద్దరు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.













