ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబుకు ఘన సన్మానం

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7న (ఆదివారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘన సన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ భవన్‌కు తరలిరావాలని పిలుపునిచ్చింది.