చరిత్రలో తొలిసారిగా…తెలుగు వ్యక్తిని
చరిత్రలో తొలిసారిగా కార్డినల్‌గా తెలుగు వ్యక్తి పూల ఆంథోని నియమితులు కావడం దేశానికే గర్వకారణమని టీఎస్ ఫుడ్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ అన్నారు. హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన క్యాథలిక్ వేడుకల్లో పూల ఆంథోనిని ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రాజీవ్‌సాగర్ మాట్లాడుతూ కార్డినల్‌గా ఆంథోని ఎదిగిన తీరు ఆదర్శనీయమని కొనియాడారు. యూత్ కమిషన్ చైర్మన్‌గా, ఏపీ సోషల్ సర్వీస్ సొసైటీ కార్యదర్శిగా, తెలుగు క్యాథలిక్ పీఠాధిపతుల సమాఖ్య కోశాధికారిగా పూల ఆంథోని అనేక సేవలు అందించారని గుర్తు చేశారు.













