యాదాద్రిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు, ఈవో గీతతో పాటు పలువురు పాల్గొన్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుండి ఈ నెల 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ ఉన్నందున బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేశారు. 10న ఎదుర్కోలు, 11న తిరుకల్యాణ మహోత్సవం, 12న దివ్యవిమాన రథోత్సవం, 13న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 14 వరకు భక్తులచే జరపబడే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.













