ముషీరాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగేది నేనే
ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని వీడినా, తాను మాత్రం పార్టీతోనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నానని వెల్లడించారు. ముషీరాబాద్ నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నారని, అందుకే పార్టీ అధిష్ఠానం తనను బరిలోకి దించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.













