పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి : అనిల్ కూర్మాచలం

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పట్టభద్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎంఎల్‌సీ ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో ఆలోచించి ప్రజలపక్షాన ప్రశ్నించే బీఆర్‌ఎస్ గొంతుకు మద్దతుగా నిలిస్తే కేవలం పట్టభద్రుల సమస్యల కోసమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు అండగా ఉండి పోరాడుతారని అన్నారు. కాబట్టి ఎంఎల్‌సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.