నీరాలో ఎన్నో ఔషధగుణాలున్నాయి : మంత్రి జోగి రమేష్
నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, శాస్త్రీయంగానూ ఇది నిరూపితమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అన్నారు. నెక్లెస్ రోడ్డులో ఇటీవల ప్రారంభమైన నీరా కేఫ్‌ను తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి జోగి రవేష్, సినీ హీరో సుమన్ పరిశీలించారు. నీరా విక్రయం గురించి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. నీరా తాగి, అక్కడ విక్రయిస్తున్న తినుబండారాల రుచి చూశారు. నీరా కేఫ్ స్టాళ్లతో పాటు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ గురించి తెలుసుకున్నారు. వేదాల్లోనూ నీరా గురించి ప్రస్తావన ఉందని, కాలక్రమంలో నీరా గురించి తప్పుడు ప్రచారం జరిగిందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగి రమేష్ తెలిపారు. గీతవృత్తి కార్మికులను ఆదుకునే విధంగా నీరా పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చినట్లు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నీరా కేఫ్ లను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి జోగి రమేష్ తెలిపారు.













