నిరుపేదకు ఇల్లు కటించిన ఎన్నారై జంట
భర్తను కోల్పోయి నిలువ నీడ లేక ముగ్గురు పిల్లలతో రోడ్డు మీద పడిన ఓ మహిళకు త కుమారుడి పుట్టన రోజు సందర్భంగా ఇల్లు నిర్మించి తమ దాతృతాన్ని చాటుకుందో ఎన్నారై జంట. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కటికెనపల్లి గ్రామానికి మల్లీశ్వరి భర్త కొద్ది నెలల క్రితం మరణించాడు. అప్పటి వరకూ మల్లీశ్వరి అద్దెకుంటున్న ఇంటిని యజమాని ఖాళీ చేయించడంతో ఆ కుటుంబానికి ఇల్లు లేకుండా పోయింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె గురించి గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న కరీంనగర్‌కు చెందిన ఎన్నారై ముక్క నవీన్ కుమార్, సూర్య ప్రియదర్శిని దంపతులు స్పందించారు. తమ కుమారుడి జన్మదిన కానుకగా రూ.1.40 లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి మల్లీశ్వరికి ఇచ్చారు.













