ప్రవాస భారతీయ మహిళలు, చిన్నారుల కోసం.. అంతర్జాతీయ సదస్సు
ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయ మహిళలపై గృహ, లైంగిక హింస, పరువు హత్యలు, ఎన్నారై పురుషుల వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన కార్యచరణపై యూనివర్సీటీ ఆఫ్ హైదరాబాద్‌లో రెండు రోజులు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. భారతీయ మహిళలు, పితృస్వామ్యం`హింస, సాంస్కృతిక గుర్తింపు అంశంపై జరిగే ఈ సదస్సులో యూనివర్సిటీ వీసీ బీజేరావుతో పాటు వివిధ దేశాల వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫిజీ, నేపాల్, జపాన్, బంగ్లాదేశ్‌కు చెందిన 200 మందికి పైగా నిపుణులు పాల్గొంటారు. ప్రవాస భారతీయ మహిళలు, చిన్నారుల రక్షణ, చట్టపరమైన హక్కులు తదితర అంశాలపై చర్చిస్తారు.













