తెలంగాణలో అమిత్ షా పర్యటన ?
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా నిర్మల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మల్ ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి దాదాపు వెయ్యి మంది ప్రజలు అమరులైన ప్రదేశం ఉందని, కాబట్టి నిర్మల్లో సభను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. అమిత్ షా పర్యటనపై రెండు రోజుల్లో రాష్ట్ర నాయకత్వంతో కేంద్ర నాయకత్వం చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత అమిత్ సా పర్యటన ఖరారవుతుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.













