ఈనెల 11న హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఈ నెల 11న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేయనున్న పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు. కాగా ఈ నెల 11న నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74 ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషర్లను పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ బ్యాచ్‌లో 195 మంది ప్రొబేషనర్లు శిక్షణ పొందారు. ఈ పరేడ్‌కు కేరళ కేడర్‌కు చెందిన శెహన్‌షా నేతృత్వం వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎనిమిది సంవత్సరాల శిక్షణ పొందిన శెహన్‌షా జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు మెడల్స్ గెలుచుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన సీఐఎస్ఎఫ్, ఐఆర్పీఎఫ్లలో సైతం బాధ్యతలు నిర్వర్తించారు.













