22న హైదరాబాద్ కు అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 22న హైదరాబాద్ రానున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆరోజు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల క్లస్టర్లతో ఆయన సమావేశం కానున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అమిత్షా సమీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేయనున్నారు. కాగా 2019 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు అమిత్ షా ఇప్పటి నుంచే పక్కా వ్యుహంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా తెలంగాణలో అధికార టిర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అమిత్ షా ఇక నుంచి తరచూ రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.













