హైదరాబాద్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక
కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన 16న సాయంత్రం నగరానికి చేరుకుంటారు. 17న ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతకాన్ని ఎగురవేసి, కేంద్ర హోంశాఖ పరిధిలోని వివిధ బలగాల సైనిక వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. హైదరాబాద్ సంస్థానం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోదులు లేదా వారి కటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మదినం కూడా కావడంతో, ఈ సందర్భంగ్నా పురస్కరించుకుని జరిగే సేవా కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు.













