డిసెంబర్ 3న హైదరాబాద్ లో బీజేపీ జెండా ఎగరాలి : అమిత్ షా
తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పవిత్ర భూమి ఆదిలాబాద్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. డిసెంబరు 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. గిరిజన వర్సిటీకి కేసీఆర్ ప్రభుత్వం జాగా చూపించలేదు ఆందుకే ఆలస్యమైంది. మోదీ కృష్ణా ట్రెబ్యునల్ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారు. పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు. కేసీఆర్ రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. మోదీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించింది అని తెలిపారు.













