తెలంగాణలో మూడో వేవ్‍కు రెడీ …. సీఎస్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్‍కు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సీఎస్ సోమేష్‍కుమార్ నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించి, డాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మూడో వేవ్‍కు రెడీ అవుతున్నామని తెలిపారు. నీలోఫర్‍లో పరిస్థితి అధ్యయనం చేసి నివేదిక రెడీ చేస్తున్నామని తెలిపారు. నీలోఫర్‍లో వెయ్యి పడకలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష అనంతరం సౌకర్యాలు పెంచుతామని తెలిపారు.