అమీర్ పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభం
భాగ్యనగరానికే తలమానికమైన హైదరాబాద్ మెట్రో రైలు కారిడార్-1 (మియాపూర్-ఎల్బీనగర్) మార్గం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, అమీర్పేట నుంచి ఎల్బీనగర్ వెళ్లే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గవర్నర్ సహా ప్రముఖులందరూ అమీర్పేట నుంచి మెట్రోలో ఎల్బీనగర్కు పయనమయ్యారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో ప్రయాణికులకు అనుమతించనున్నారు. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్-అమీర్పేట్ మార్గంలో మెట్రో రైలు ఎట్టకేలకు ప్రారంభం కావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













