ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల పై ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్లో కొందరు నేతలు పని చేస్తూ మాట్లాడితే బాగుంటుందని అన్నారు. మూడేళ్లు నుంచి ఎక్కడ కనిపించని నేతలు రాళ్లు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి షీల్డ్ కవర్ పీసీసీ ప్రెసిడెంట్ కాదని, మెజారీటీ అభిప్రాయం మేరకు పీసీసీ అయ్యారని తెలిపారు. పీసీసీ మీద రాళ్ళు వేస్తే పార్టీకి నష్టమన్నారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడాలని సూచించారు. రేపటి పాదయాత్ర లో వెంకట్ రెడ్డి పాల్గొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆహ్వానాలు పంపడానికి ఇది ఎవరి ఇంట్లో పెళ్లి కాదని, అందరికీ గాంధీ భవన్ నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు. తమకు కూడా గాంధీ భవన్ నుంచే ఫోన్లు వచ్చాయని వెళ్లి పని చేస్తున్నామని అన్నారు. సొంత తమ్ముడు కావడం వల్ల వెంకట్ రెడ్డికి కొంత ఇబ్బంది ఉండొచ్చన్నారు. మునుగోడులో తాము ఇంటింటి వెళ్లి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.













